వన్యప్రాణుల దాహార్తికి ఉపశమనం… దావనపల్లి ఫారెస్టులో సిమెంట్ తొట్టెల ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 08 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం దావనపల్లి గ్రామ పరిసర ఫారెస్ట్ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ ప్రజాప్రతినిధులు మరియు అటవీ శాఖ అధికారులు కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్‌లో సిమెంట్ తొట్టెలు నిర్మించి, వాటిలో నీటిని నింపే ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో దావనపల్లి గ్రామ సర్పంచ్ మలవత్ ప్రసాద్, ఉప సర్పంచ్ భానోత్ రవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేష్, బీట్ ఆఫీసర్ మహమ్మద్ షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు. గ్రామ నాయకులు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించారు. వన్యప్రాణులు నీటి కోసం గ్రామాల వైపు రాకుండా, అడవిలోనే వాటికి తగిన నీటి వనరులు అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *