విద్యార్థులను కులం పేరుతో దూషించినటువంటి టీచర్ ఐ రాజు పై డీఈఓ కి ఎందుకు ఇంత ప్రేమ.

డీఈఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మిగనూరు విద్యార్థి సంఘాలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కులం పేరుతో దూషించినటువంటి టీచర్ ఐ రాజు పై డి ఈ ఓ కు ఎందుకంత ప్రేమ అని ఎమ్మిగనూరు విద్యార్థి సంఘ నాయకులు డీఈఓ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు శేఖర్, ఉదయ్, ఆఫ్రిది, రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి వివర్స్ కాలనీ జడ్పీ హైస్కూల్ లో టీచర్గా విధులు నిర్వహిస్తున్న ఐ రాజు విద్యార్థులను తమ కులాల పేరుతో దూషిస్తూ విద్యార్థులను మానసిక శోభకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది అని పాఠశాలలకు వచ్చేటటువంటి విద్యార్థులను సమానంగా చూడాల్సినటువంటి టీచర్లే కులాల పేరుతో దూషిస్తూ ఉంటే విద్యార్థులు ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నారని దేవాలయం లాంటి బడిలో కొంతమంది విద్యార్థులకు కులాన్ని అంటగడుతూ తీరని ఆనందాన్ని పొందడం జరుగుతుంది. ఈ సమస్య పైన కొన్ని వారాల క్రితం పి జి ఆర్ ఎస్ లో డీఈఓ కి ఫిర్యాదు చేయగా ఆయన మాత్రం టీచర్ అయినటువంటి ఐ రాజు పై ఎందుకంత ప్రేమ నీ కనీసం అంటే ఆయన పైన విచారణ కూడా చేయనటువంటి పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిని బట్టి చూస్తే డీఈఓకి ముడుపులు అందాయి అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని వారు ఆరోపణలు చేశారు. డీఈఓ విద్యార్థులను ఇలాంటి మానసిక శోభకు గురి చేస్తున్న నోరు మెదపట్లేదు అంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయమని చిన్న స్థాయి కులాలు అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు అని కిందిస్థాయి కులాల విద్యార్థులు జీవితాలు అంటే మీకు అంత చులకనా అని వారు మండి పడ్డారు ఇకనైనా పై అధికారులు దీనిపై స్పందించి కులం పేరుతో దూషించినటువంటి ఐ రాజు కు వత్తాసు పలుకుతున్న డీఈఓ పై చర్యలు తీసుకొని ఐ రాజు టీచర్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశారు లేనిపక్షంలో వివిధ ఉద్యమాలకు దారితీస్తామని వారు ఘాటుగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *