విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాలాజీ విద్యానికేతన్ స్కూల్ని సిజ్ చేయాలి.

సెలవు రోజున పాఠశాల నిర్వహించిన కూడా పట్టించుకొని విద్యాశాఖ అధికారులు పై కఠిన చర్యలు తీసుకోవాలి.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. విద్యార్థుల ప్రాణాలు తో చెలగాటమాడుతున్న బాలాజీ విద్యానికేతన్ స్కూల్ ని సీజ్ చేయాలని కర్నూల్ జాయింట్ కలెక్టర్ నూరూల్ కమ్మర్ కి ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు రఘు లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో గత మూడు రోజుల కిందట గుడ్ ఫ్రైడే పండుగ సెలవు రోజున బాలాజీ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం పాఠశాల నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు స్కూలు లో మూడో తరగతి గదిలో శిథిలావస్థలో ఉన్న భవనము యొక్క పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు పై పడడంతో ఒకరు తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయలతో బయటపడడం జరిగింది. బాలాజీ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం వారికి గుడ్ ఫ్రైడే పండుగ సెలవు అని తెలిసి కూడా పాఠశాల నిర్వహించడం ఏంటని, అలాగే ఆరోజు పాఠశాల పెట్టడం వల్లే ఈ సంఘటన జరిగే ఇద్దరు విద్యార్థులు గాయాలకు అయిందని ఒకవేళ ఆరోజు పాఠశాల లేకపోతే ఎటువంటి ప్రమాదం జరిగేది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డి ఈ ఒ స్వయంగా పర్యవేక్షించిన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుందని కావున ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యం క్రిమినల్ కేసు నమోదు చేసి పాఠశాల ను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జేసీ సానుకూలంగా స్పందించి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆదోని డివిజన్ అధ్యక్షులు ప్రదీప్, రోషన్, రాజు తదితరులు పాల్గొన్నారు.