శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవములు చివరి రోజుద్వాదశ ప్రదక్షణాలు అనంతరం పవళింపు సేవ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 8 జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవములు చివరి రోజు అయిన నిన్న సాయంత్రం ఏడు గంటలకు ద్వాదశ ప్రదక్షణాలు అనంతరం పవళింపు సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుహాసినిలకు జాకెట్ ముక్కలు కుంకుంభరణాలు ప్రసాదములు అందించుట జరిగింది ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణ అధికారి నూతక్కి వెంకట సాంబశివరావు తెలియజేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థా నం సిబ్బంది గ్రామ పెద్దలు భక్తులు మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు