సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8-04-26 కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్తా విశ్లేషణ :మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు జైనూర్ మండల జండాగూడ గ్రామానికి చెందిన కోరంగా రాదా బాయి కి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కును మంగళ వారం మార్కెట్ కమిటీ కార్యాలయం లో చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దృష్టికి చైర్మన్ తీసుకెళ్లడంతో రూ.28 వేలు మంజూరు చేయించారు. అత్యవసర సమయం లో పేద కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిధులు విడుదల చేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం మీరా జాలీంషా, మెస్రం స్పందన భూపతి, పంద్రా కౌసల్య షేకు, సేద్మకి జానేరావు, మడావి లక్ష్మణ్, కోట్నాక్ బాపూజీ, దుర్వ సింధు నగేష్, కాంగ్రెస్ నాయకులు మెస్రం అంబాజీ రావు, పెందుర్ ప్రకాష్, గెడం గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.