పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 8 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా వెనుకబడినటువంటి నియోజకవర్గాలైన పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, ఆదోనిలను కలిపి ఆదోని కేంద్రంగా ఆదోని జిల్లా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఎమ్మిగనూరు నియోజకవర్గం సభ్యులైన కమాలే గణేష్, బతుకమ్మ, నీలకంఠ, సత్యనారాయణ రెడ్డి, ఎల్లప్ప, రామకృష్ణ 143వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చుని ఆదోని జిల్లా ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లైన బహుజనులు అభివృద్ధి చెందాలంటే కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆదోని జిల్లా చేయాలని వారు మాట్లాడడం జరిగింది. టిడిపి, జనసేన, బిజెపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోసుకెలేనటువంటి ప్రాంతాన్ని ఆదోని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఐదు నియోజకవర్గాల్లో నిరుద్యోగులకు ఉపాధి చూపే పరిశ్రమలు లేక వలసలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లాకు అడ్డుపడుతున్న నాయకులు వెనుక తిరుగుతున్నటువంటి చోటా నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమందరం ఐక్యమత్యంతో ఆదోని జిల్లాకి మద్దతుగా నిలిచి ఆదోని జిల్లా సాధించాలి. మీరు ఏ నాయకులు వెనకైతే ఉన్నారో వారు వాళ్ళ యొక్క పదవుల కోసం మిమ్మల్ని పౌలుగా వాడుకుంటున్నారే తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల జాతుల కోసం ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఒక్కటే తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటుంబ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని జేఏసీ నాయకులు హెచ్చరిక చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పగడాల కోదండ, దాసరి గోవిందు, దాసరి నరేష్, సుభాష్ చంద్రబోస్, ఆంజనేయులు, సుగుణమ్మ, బండారి హనుమంతు, గుమ్మాల బాలస్వామి, కుమార్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు