పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 09 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : నగర పంచాయతీలో స్మశాన వాటికకు స్వర్గీయ బదిరెడ్డి వెంకన్న దొర జ్ఞాపకార్థం వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో బుధవారం ఫ్రీజర్‌ను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు చేతుల మీదుగా ఫ్రీజర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ సమాజ సేవలో బదిరెడ్డి గోవింద్ బాబు ముందుండి పనిచేయడం అభినందనీయమని కొనియాడారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఈ సందర్భంగా బదిరెడ్డి గోవింద్ బాబు మాట్లాడుతూ ఏలేశ్వరం మండలంలో పేద ప్రజలకు ఫ్రీజర్ సదుపాయం లేకపోవడం వల్ల అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించి,వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తమ సొంత నిధులతో ఫ్రీజర్ తయారు చేయించడం జరిగిందని తెలిపారు.అలాగే ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ భవనం నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు.కైలాస ధామ నిర్వాహకుడు మాట్లాడుతూ ఫ్రీజర్ అందుబాటులో లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఫ్రీజర్ తీసుకుని రావడానికి చాలా ఇబ్బంది పడే వారిని,వారు కష్టాలను గుర్తించి ఫ్రీజర్ బహురించిన గోవింద్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బదిరెడ్డి వెంకన్నబాబు,సామంతుల సూర్యకుమార్,కోరాడ ప్రసాద్, దళే కిషోర్ ,శేఖర్, ప్రగళ్లపాటి కామేష్,వేధిక సురేష్, పిరాట్ల సాయి విసు,డేగల చంద్రమౌళి,డేగల రమణ,భీశెట్టి రాజా,దత్తి రాజా,సఖిరెడ్డి బుజ్జి,ఆకుల గంగరాజు,గొల్లపల్లి కాశి,జువ్విన వీర్రాజు ,మధు,సిరిపురపు రాజేష్,రాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.