గూడెం క్షేత్రం లో దుకాణాదారులకు నోటీసులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 దండేపల్లి దండేపల్లి మండలంలోని గూడెం పుణ్యక్షేత్రంలో మద్యం, మాంసం విక్రయిస్తున్న దుకాణదారులకు అధికారులు హెచ్చరిక నోటీసులు అందజేశారు.దండేపల్లిలోని గూడెంగుట్ట ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసాహార విక్రయాలపై అధికారులు కఠిన నిబంధనలు విధించారు. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్రానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తున్న దృష్ట్యా, ఆలయ పవిత్రతను కాపాడాలని దుకాణదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో ఎంపీఓ విజయ్ ప్రసాద్, ఎస్ఐ తహసీనోద్దిన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న, పంచాయతీ సెక్రటరీ నాగరాజు పాల్గొన్నారు..