పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 (జనగామ ప్రతినిధి కమ్మగానినాగన్న) జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదనే ప్రచారంపై పాలకుర్తి మార్కెట్ చైర్‌పర్సన్ లావుడియా మంజుల స్పందిస్తూ, పాలకుర్తి మండలంలో ఇప్పటికే సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు కొనసాగుతున్నది అని స్పష్టం చేశారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం మద్దతు ధర 2400 రూపాయలు కు అనుగుణంగా మొక్కజొన్న కొనుగోలు జరుగుతోందని తెలిపారు రైతుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యం అని, కొనుగోలు కేంద్రాన్ని మరింత బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు మొక్కజొన్న పంటను తక్షణమే సెంటర్‌కు తీసుకురావాలని, తూకం, చెల్లింపుల విషయంలో పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, నిర్దిష్ట వాస్తవాలను విస్మరించే వ్యాఖ్యలు బాధాకరమని ఆమె అభిప్రాయపడారు పాలకుర్తి మార్కెట్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని చైర్‌పర్సన్ లావుడియా మంజుల హామీ ఇచ్చారు