మంత్రి అడ్లూరి వ్యాఖ్యలు అర్ధ రహితం.

* 6 గ్యారంటీల అమలు చేసి మాట్లాడాలి. * బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్.

పయనించే సూర్యుడు 9-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆ జీవిక మిషన్ గ్రామీణ్ అని పేరు మార్చి ఉపాధి కూలీల పాలిట శాపంగా మార్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. తెలంగాణలో నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టారని అసలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఇందిరమ్మకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బస్టాండ్ లలో గ్రామ కూడల్లలో నిర్మించిన మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టకుండా ఇందిరమ్మ రాజీవ్ గాంధీ పేర్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గాంధీ పేరు తొలగించి గాంధీజీని మరోసారి హత్య చేయాలని బిజెపి చూస్తుందని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన గాంధీలు అందరూ నకిలీ గాంధీ లేనని అసలైన గాంధీల పేరు చెప్పుకోనిదే కాంగ్రెస్ పార్టీకి పూట గడవని పరిస్థితిలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మెజార్టీ ఎంపీల అభిప్రాయం మేరకు పథకం పేరు మార్చిందని విధివిధాలను మరింత మెరుగుపరిచిన విషయం కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలన్నారు. ఈ పథకం విషయంలో కేంద్రం రాష్ట్రాలపై ఎలాంటి బారం నెట్టడం లేదని పాత విధానాన్నే కఠినంగా అమలు చేస్తూ ప్రజలకు చెందాల్సిన డబ్బులకు జవాబుదారితనం మరియు పథకంలో జరుగుతున్న అవినీతి నిర్మూలనకు మార్పులు తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. ఉపాధి కూలీల పని దినాలు గతంలో 100 రోజులు ఉంటే ప్రస్తుతం 125 రోజులకు పెంచిందని ఉపాధి హామీ కూలీల వేతనాన్ని కూడా పెంచిందని ఇట్టి వేతనాలను నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. నకిలీ జాబ్ కార్డుల ఏరివేత పనికి హాజరు కాకున్నా రికార్డుల్లో హాజరైనట్టు నమోదు చేయడం మొదలగు విషయాలను నిరోధించడం మరియు నూటికి నూరు శాతం డిజిటలైజేషన్ ఆధార్ సీడింగ్ జియో ట్యాగింగ్ ఎన్ ఎం ఎస్ ఎస్ యాప్ డిబిటి నిధుల పర్యవేక్షణపై పనుల ఎంపికలో మార్పు సోషల్ ఆడిట్ లాంటివి గ్రామసభల ముందు జవాబుదారితనంగా ఉండడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే స్కాములు చేసి కమిషన్లు దొబ్బిన కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుందని ఇది కాంగ్రెస్ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లయితే 6 గ్యారంటీలో అమలు చేసి మాట్లాడాలని అన్నారు.ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చెవులమద్ది శేఖర్, జిల్లా నాయకులు కట్ట మహేష్, నాయకులు సింహాచలం సత్యనారాయణ,ప్రశాంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *