మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతులమీదుగా పుస్తె మెట్టెలు అందజేత

పయనించేసూర్యుడు. న్యూస్.9.ఎప్రిల్. పుల్కల్ మండలప్రతినిది పెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిదిలొనిబస్వాపూర్ ఎ.ఎస్.ఫన్ క్షహల్ లొ బుధవారంపుల్కల్ గ్రామానికిచెందిన కళ్యాణ వేడుకలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి ఆనవాయితీగా నూతన వధువుకు పుస్తెమెట్టలను అందిస్తున్నారు ఇందులో భాగంగా నంది మాణిక్ రెడ్డి మాధవి. కుమార్తె అయిన మనసుకు పుస్తెమెట్టలను మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ఆడపిల్ల కు పెళ్లయిన పుస్తె మెట్టెలు అందించడం గొప్ప మనసు కావాలన్నారు. సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డికి ఆ అవకాశం దొరకడం దేవుడు చేసుకున్న వరమని ఆయన కొనియాడారు. గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేయడం ఆనందం కలిగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈయన వెంట బి ఆర్ యస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి. గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి. టి.ఆర్.ఎస్ .మండల అధ్యక్షులుమాచర్లవిజయ్ కుమార్. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస చారి. మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *