శ్రీ కృష్ణ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు అయ్యన్నగారి హరికృష్ణారెడ్డి గారికి కరపత్రం అందిస్తున్న గోసంరక్షణ ప్రచారక్ స్వామి హేమంత దాస్,

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /09:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని ఆవును జాతీయ ప్రాణి హోదా ఇచ్చి గుర్తించాలి. స్వామి హేమంత్ దాస్, ఆవును (గోమాత) జాతిమాత, జాతీయ దేవత, జాతీయ ఆరాధన, జాతీయ వారసత్వం గుర్తించి గౌరవించాలని గోసంరక్షణ ప్రచరక్ స్వామి హేమంత్ దాస్ కోరారు .నందిబాబా నీలమణి వృషభ్ దేవ్ ఆధ్వర్యంలో గోమాత ,రక్షణకై పిలుపు ప్రచారంలో భాగంగా ఈరోజు ఇల్లంతకుంట మండలానికి విచ్చేసిన స్వామీజీ మాట్లాడుతూ భారతదేశం అంతటా గోసేవ సమానంగా జరిగేలా,గోవధను పూర్తిగా నిషేధించేలా చట్టాలు రూపకల్పన చేయాలని అన్నారు.గోమాత శరీరంలో 33 కోట్ల దేవతల ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటుందని,గోమూత్రం పేడ దివ్య ఔషధాలు మరియు విషరహిత వ్యవసాయానికి ప్రాథమిక పునాది అని ,ఆవు లేకుండా భారతీయ సంస్కృతి,సంప్రదాయం,విలువలు,జీవనశైలిని ఊహించలేమన్నారు.ఏప్రిల్ 27 వ తేదీని గోమాత దినోత్సవంగా భావిస్తూ భారతీయులు,గోప్రేమికులు 31 డిమాండ్లతో దేశంలోని అన్నిమండల కేంద్రాల్లో సంబంధిత మండల తహశీల్దార్ లను కలిసి గోమాతను జాతిమాతగా గుర్తించేందుకు చర్యలు కోరుతూ దరఖాస్తు సంపర్పించాలని ఈకార్యక్రమం లోగోసేవకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గోప్రేమికులు ఓం సింగ్ రాజ్ పురోహిత్, శ్రీ కృష్ణ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు అయ్యన్న హరికృష్ణా రెడ్డి, ట్రస్ట్ సభ్యులు మరియు బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *