స్టెల్లా మేరీస్ యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

ముఖ్య అధితులుగా మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఫాదర్ క్రీస్తుబాబు( ఓ సి డి )

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 09 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలో మొరంపల్లి బంజర్ గ్రామం లో స్థానిక స్టెల్లా మేరీస్ పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు తమ విద్యలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసి ఫస్ట్ క్లాస్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాజీ ఉపసర్పంచ్ మాట్లాడుతూ, “పిల్లలు వేసే ఈ చిన్న అడుగులు వారి భవిష్యత్తులో గొప్ప విజయాలకు బాటలు వేస్తాయి. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు, విలువలు నేర్చుకుంటే వారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. పిల్లలు మీరు గురువులను గౌరవించేవారుగా ఉండాలి గురువులంటే దైవంతో సమానం క్రమశిక్షణ కలిగి చదువుపట్ల శ్రద్ధ కలిగి ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. మరొక అతిథిఫాదర్ క్రీస్తుబాబు తన ప్రసంగంలో, “విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. పిల్లలు ఆటల ద్వారా, అనుభవాల ద్వారా కూడా ఎన్నో నేర్చుకుంటారు.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు కలిసి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి” అని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సుమలత మాట్లాడుతూ, “మా పాఠశాలలో విద్యతో పాటు నైతిక విలువలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాము. ప్రతి చిన్నారి భవిష్యత్తులో మంచి పౌరుడిగా ఎదగాలని మా లక్ష్యం”.తల్లీదండ్రులు ఇంటి వద్ద పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని అని తెలిపారు.
కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పాటలు, నృత్యాలతో తమ ప్రతిభను చూపించారు. అనంతరం ప్రతి విద్యార్థికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌లు ముఖ్య అతిధులు ద్వారా సిస్టర్ సుమలత అందజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చిన్నారులను అభినందించారు. ఆనందభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *