అక్రమ సంబంధం వల్లే హత్య..సి ఐ.పి.సాయి ప్రసాద్..

★ చౌడేపల్లి(మం)బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడు వాసి గాంధీ దారుణ హత్య.. ★ మృతుడి తమ్ముడు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చౌడేపల్లి పోలీసులు.. ★ మృతుడి భార్యతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ★ A1 గా దేవరకొండ నరసింహులు.A2 గా దేవరకొండ లక్ష్మీపతి,A3 గా రాసాతి, A4 గా దేవరకొండ నాగరాజు పై కేసు నమోదు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు..

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్10.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) ఇప్పటికీ రెండు సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం తాలూకా కోస వంపు దూర్ ఇరు లర్ కాలనీకి చెందిన జి. గాంధీ తన భార్య అయిన రా పా తి తో కలిసి చౌడేపల్లి మండలం ఊటూరు దగ్గర కోళ్ల ఫారం లో పనికి వచ్చి ఉంటే ఆర్ఆర్ కాలనీకి చెందిన నరసింహులు ఆమెకు పరిచయం తన భర్తను వదిలి నరసింహులు తోపాటు వెళ్ళిపోయి అతనితో సహజీవనం చేస్తూ ఉంటే 10 రోజుల క్రితం గాంధీ బోయకొండ కు వచ్చి తన భార్యను తనతో రమ్మని వేధించగా ముద్దాయిలు నరసింహులు అతని తమ్ముళ్లు లక్ష్మీపతి నాగరాజు@నాగు రా ఫా తి లు ఒక పథకం ప్రకారం 05.04.2026 వ తేదీ రాత్రి 8 గంటలకు గాంధీని అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాపించి రాళ్లతో కట్టెలతోకొట్టి చంపి అక్కడనుండి పారిపోగా ఈ సంఘటనపై గాంధీ తమ్ముడు అయిన జి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌడేపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు సెక్షన్ నెంబర్38/2026 యు ఎస్ 103 ( 1) ఆర్/డబ్ల్యు 3( 5) బి.ఎన్.ఎస్ కేసుగా నమోదు చేయబడినది ఈ కేసును దర్యాప్తు ప్రారంభించిన చౌడేపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి సాయి ప్రసాద్ మరియు ఆయన బృందం కేసును అత్యంత వేగవంతంగా దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించి హత్యకు కారకులైన ముద్దాయిలు ఏ వన్ దేవరకొండ నరసింహులు ఎటు దేవరకొండ లక్ష్మీపతి ఏ త్రీ జి రా ఫా తి ఏ ఫోర్ దేవరకొండ నాగరాజు@నాగు ల ను ఈరోజు 09.04.2026 వ తేదీ ఉదయం 10 గంటలకు బోయకొండ ఆర్చ్ నిమ్మలపల్లి రోడ్డు నందు వారిని అరెస్టు చేసి వారు నేరాని కై ఉపయోగించిన కట్టే రాళ్లనును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాం డు కు పంపడం జరిగింది