
పయనించే సూర్యుడు ఎప్రిల్ 10 రిపోర్టర్ కామని ప్రమోద్ మక్కల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే పెంచాలి పాకాల ఆయకట్టు కిందా రైతుల వరిపొలాలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే గాని అధికారులు గానీ పట్టించుకోకపోవడం విడ్డూరం బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో 70 వేల ఎకరాలకు పైగా రైతులు ఈ యాసంగిలో మక్కాజొన్నా సాగు చేయడం జరిగింది మొక్కజొన్న సాగు విస్తీర్ణం సంబంధించి వ్యవసాయ అధికారుల దగ్గర స్పష్టమైన లెక్కలు ఉన్నప్పటికీ మొక్కల దిగుబడికి అనుగుణంగా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది పాకాల సరస్సులో గోదావరి నీళ్లు సరిపడా ఉన్నప్పటికీ రైతులకు సాగునీటిని అందించడంలో స్థానిక ఎమ్మెల్యే అధికారులు పూర్తిగా విఫలమైనారు అరకొరగా ముక్కలూ కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం ఒక్క మక్కజొన్నా రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు ప్రభుత్వం మక్కల కేంద్రాలను సరిపడ ఏర్పాటు చేయడంలో మరియు మక్కలను కొనడంలో పూర్తిగా విఫలమైంది మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నామమాత్రంగా ప్రారంభించిది మక్కలకు బోనస్ అన్నారు ఇప్పుడు దాని ఊసే లేదు కనీసం మక్కలు కొనె పరిస్థితి కరువు అయింది ఈ రాష్ట్రంలో మక్కలు పండిచిన రైతులకు మక్క కొనుగోల్లను ఆలస్యం చేసారు మక్కలకు బోనస్ అన్నారు ఇప్పుడు దాని ఊసే లేదు కనీసం మక్కలు కొనె పరిస్థితి కరువు అయింది రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను ప్రయివేట్ వ్యక్తులకు రూ 1700-1800కే రైతులు అమ్ముకుంటున్నరు గతంలో కెసిఆర్ గారు ముందు చూపుతో రైతులకోసం ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు రైతుబంధు కొనుగోళ్ళ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం రైతుల పాలిట శాపం లా తయారైంది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలేచి అన్ని గ్రామాల్లో మక్కల కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించి చేతులు దులుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వం అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మక్కలు పండించిన రైతులు రోడ్ల పైన అరిగో స పడుతున్నారు మండల కేంద్రాలలో మార్కెట్లలో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం వలన రైతులకు మక్కలు అమ్ముకోవడం చాలా అసౌకర్యంగా మారింది వాతావరణ శాఖ వారు వర్షాలు ఉన్నవి అని హెచ్చరిస్తున్నారు కావున తక్షణమే కొనుగోలు కేంద్రాలను పెంచి ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయాలి లేని పక్షంలో రైతులకు మద్దతుగా నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతాం దీనికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సర్పంచులు క్లస్టర్ బాధ్యలు మండల పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు