కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 10 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు భోజనాలను వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు,ఆస్పత్రి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ టిడిపి యువనాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ,మూది నారాయణ స్వామి లు హాజరై భోజనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ప్రతినెల తొమ్మిదో తారీఖున గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈరోజు ముమ్మిడిశెట్టి మణికంఠ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు.ఇప్పటికే ఆస్పత్రి ఆవరణలో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం,ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి సభ్యులకు,చైర్మన్ వాగు రాజేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్,కూటమి శ్రేణులు బుగతా శ్రీను,సామంతులు గోపి,ఎండగుండి నాగబాబు,అనంతారపు రాజు,గొల్లపూడి త్రిమూర్తులు,స్కూల్ చైర్మన్ శ్రీను,శంకర్,చలంచర్ల నాగేశ్వరరావు,వాగు బద్రిష్,ఆస్పత్రి సిబ్బంది చక్రవర్తి,ప్రమీల,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.