జంక్ ఫుడ్ మరియు ప్యాకెట్టు తయారీ ఆహార పదార్థాలపై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 10 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున అంగన్వాడీల ప్రాజెక్టు చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో గల పెనుగంచిప్రోలు గ్రామంలో సీడీపీవో ఆదేశాల మేరకు పి హెచ్ సి నందు డాక్టర్ అనురాధ తాసిల్దార్ శాంతిలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ పక్వాడా లో భాగంగా ఈరోజు జంక్ ఫుడ్ మరియు ప్యాకెట్టు తయారీ ఆహార పదార్థాలపై అవగాహన కార్యక్రమం కలిగించుట జరిగింది మరియు గర్భిణీ బాలింతలు పిల్లల కోసం స్థానికంగా లభ్యమయ్యే పోషకాహారం గురించి వివరించి గర్భిణీ స్త్రీలకు డాక్టర్ అనురాధ చే ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ అనురాధ తాసిల్దార్ శాంతిలక్ష్మి మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్లు తల్లులు మొదలగువారు పాల్గొనటం జరిగింది