పయనించే సూర్యుడు ఏప్రిల్ 10,మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్:. రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో 'ఆది చింతల మునిరంగ స్వామి' వీధి నాటకం గ్రామస్తులను విశేషంగా అలరించింది. స్వామి వారి కృప గ్రామంపై, ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిర్మలాపూర్ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి సంతోష వెంకటేష్ హాజరయ్యారు. నిర్వాహకులు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతికి కళలే ఆయువుపట్టని, ముఖ్యంగా భక్తి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో వీధి నాటకాలు కీలక పాత్ర పోషిస్తాయని కొనియాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామస్తుల మధ్య ఐక్యతను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ మంత్రి రామ్ చందర్, మాజీ సర్పంచ్ రామకృష్ణ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు తాహిర్ పాషా, వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పుల్లయ్య తో పాటు బిఎస్పీ మండల అధ్యక్షులు కాకర్జాల యాదగిరి, విఆర్ఓ శ్రీనివాస్, గ్రామ నాయకులు చుక్క మల్లయ్య, మేకల శ్రీనివాస్, యం భీమయ్య, యం చంద్రయ్య, పి చంద్రయ్య, కావాజలి శ్రీను, మేకల బాలయ్య, లింగారెడ్డి, పి నర్సిములు, రాధాకృష్ణ, నర్సింగరావు, సత్యం, భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాటక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.