పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) గురు మదనానంద బ్రాహ్మణ సేవా రుద్ర పరిషద్ ఆందోల్ ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యం లో లోక కళ్యాణార్థం 12 రోజుల పాటు నేపాల్ దేశ రాజధాని కాట్మండు లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు ముక్తినారాయణ ఆలయం మరియు పశుపతి నాథ్ శివాలయం లో ప్రత్యేక పూజలు రుద్రాభిషేకములు లలిత విష్ణు సహస్ర నామా పారాయణాలు అన్నదానములు నిర్వహించడం అయ్యింది పరిషద్ కన్వీనర్ గుడి చంద్ర శేఖర్ ఆధ్వర్యం లో వేద బ్రాహ్మణుల మంత్రముల పారాయణం తో ఆలయ పరిసరాలు మారుమ్రోగినవి ఇట్టి ప్రజాహిత కార్యక్రమం లో గుడి రాఘవేంద్రాచారి ధనుంజయ డాక్టర్ జోషి శేషాద్రి ప్రముఖ వేద పండితులు గుడి శ్రీనాథ్ రిటైర్డ్ ఎం పి డి ఓ దేశాయ్ రమేష్ బాబు శాస్త్రుల్లా రామేశ్వర్ శర్మ నారాయణఖేడ్ తాలూకా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు భక్షి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.