పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నూర్ అహ్మద్ కి వినతిపత్రం అందజేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంజయ్ శశిధర్ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మోహన్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో గత కొన్ని రోజులుగా భారీ స్థాయి లో ఎండాలు నమోదు కావడంతో రోడ్డు పై వాహనా దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎండా దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వాహన దారులకు ఉపశమనం కల్పించే విధంగా నగరంలో ప్రధాన సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్ తో రూఫ్ ఏర్పాటు చేయగలరని డిమాండ్ చేశారు కర్నూల్ నగరంలో ఏర్పాట్లు చేసారని గుర్తు చేసారు. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదు కావడంతో ప్రజలు, ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి ఇబ్బందులు గురవుతున్నారు కావున బస్టాప్ లలో ముఖ్యమైన రద్దీ ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహర్తి తీర్చాలని విజ్ఞప్తి చేసారు.