మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన చమర్తి

పయనించే సూర్యుడు-10-04-2026-రాజంపేట న్యూస్ : టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. పథకానికి సంబంధించిన రికార్డులు, వంటగది, భోజన సామాగ్రి వంటి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు రుచికరమైన, సూచికరమైన ఆహారం అందించాలని, పాఠశాల సిబ్బందికి, భోజన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి, పాఠశాల సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.