పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం సమాచార హక్కు చట్టం 2025 రిజిస్ట్రేషన్ సేవల గురించి సబ్ రిజిస్టర్ షేక్ జాఫర్ సాదిక్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ రిజిస్టర్ షేక్ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ పబ్లిక్ డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన తీసుకొనుట, ప్రజలకు జరుగు లాభాల గురించి రిజిస్ట్రేషన్ సేవలను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులో పాల్గొన్నారు