రేగా కాంతారావు జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పెన్నుల పంపిణీ కార్యక్రమం

వెంకటరమణ సేవా సమితి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

పయనించే సూర్యుడు ,ఏప్రిల్ 10 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూర్గంపాడు మండలం, సారపాక లోని బ్రిలియంట్ స్కూల్లో వెంకటరమణ సేవా సమితి, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేగా కాంతారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర  మాజీ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఆదివాసి ముద్దుబిడ్డ, మన్యం దొర, రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా స్కూల్  విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున పిల్లలందరికీ గిఫ్ట్ గా పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వెంకటరమణ సేవాసమితి ద్వారా గతంలో నందిగామలో హార్ట్ ప్రాబ్లం ఉన్న కుటుంబానికి రైస్, కొంత నగదు, ఎటపాక లోని క్యాన్సర్ కుటుంబానికి, సారపాక సుందరయ్య నగర్ లో వేడి నీళ్లు పడి కాలిపోయిన పాపకు రెండుసార్లు ఆర్థిక సహాయం, వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం చేశామని, మునుముందు కూడా వెంకటరమణ సేవాసమితి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ సేవా సమితి వ్యవస్థాపకురాలు, బిఆర్ఎస్ పార్టీ ఎక్స్ యం.పి.టి.సి. మండల మహిళా నాయకురాలు దాసరి వెంకటరమణ, దార్ల బేబీ రాణి యువజన మహిళ నాయకురాలు, సేవా సమితి సభ్యులు సాంబశివరావు, లేడా శీను, దాసరి మోహన్ రావు, పవన్ కళ్యాణ్, బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, చైతన్య రెడ్డి, సురేష్, ఎనిమిదో వార్డు సభ్యులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.