పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరం పేట మండలం లో వరి దాదాపు 9100 ఎకరాలు పండిస్తున్నారు ఆరేపల్లి గ్రామంలో వరి పరిశీలించడమైనది వరి పంటలో ముంజేయి దశ నుండి కోత వరకు యాజమాన్య పద్ధతులు అత్యంత కీలకం ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు 1. చిరుపొట్ట దశ పనికల్ ఇన్నిటియేషన్ - పి ఐ వరి కాండం లోపల వెన్ను ఏర్పడే దశను ముంజేయి దశ లేదా చిరుపొట్ట దశ అంటారు కాండాన్ని నిలువుగా చీల్చి చూస్తే 1-2 మి.మీ. పరిమాణంలో తెల్లని వెంట్రుక వంటి వెన్ను కనిపిస్తుంది
ఎరువుల యాజమాన్యం ఈ దశలో మొక్కకు నత్రజని మరియు పొటాష్ అవసరం చాలా ఎక్కువ ఎకరాకు సుమారు 20-25 కిలోల యూరియా మరియు 15-20 కిలోల పొటాష్ వేసుకోవాలి నీటి యాజమాన్యం పొలంలో 2-5 సెం.మీ. నీరు నిలకడగా ఉండేలా చూడాలి ఈ దశలో నీటి ఎద్దడి వస్తే గింజల సంఖ్య తగ్గిపోతుంది 2. పొట్ట దశ నుండి పూత దశ వరకు బూటింగ్ పూత వెన్ను బయటకు వచ్చే సమయం మరియు పూత పూసే సమయం బోరాన్ పిచికారీ గింజలు గట్టిగా నిండుగా ఉండటానికి మరియు తాలు గింజలు తగ్గడానికి బోరాన్ (20%) 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగుల నివారణ ఈ సమయంలో కాండం తొలిచే పురుగు మరియు ఆకు ముడత ఆశించే అవకాశం ఉంది చిరుపొట్ట దశలో పురుగు ఉధృతిని బట్టి తగిన పురుగుమందులు వాడాలి ముఖ్యంగా జెండా ఆకు ను కాపాడుకోవాలి తెగుళ్లు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే మెడ విరుపు లేదా పాము పొడ తెగులు సోకే ప్రమాదం ఉంది ముందస్తు జాగ్రత్తగా ట్రైసైక్లోజోల్ వంటి మందులు వాడుకోవాలి కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి నాగం కృష్ణ విస్తరణ అధికారి సుభాష్ రైతులు చిమ్మ మల్లేశం చిమ్మ సంగమేశ్వర ఉన్నారు.