స్థలానికి పట్టా ఇచ్చి 30ఏళ్ళు ఖాళీ చేయాలి లేకపోతే నీ అంత చూస్తా

★ నివాసం ఉన్న లబ్ధిదారునికి చెందాలని కోర్టు ఆర్డర్ లెక్కచేయని నాయకుడు ★ కోర్ట్ ఆర్డర్ బేఖాతర్ చేస్తున్న నాయకుడు అతనికి వత్తాసు పలుకుతున్న అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండలపరిధిలో అలవాల గ్రామంలో నిరుపేద కుటుంబం అయిన దుబ్బ కాశీం అనే వ్యక్తికి 30 సంవత్సరాల క్రితం అప్పటి తాసిల్దారు వీఆర్వో కలిసి అక్కడ చాలామంది పేదలకు పట్టాలు ఇచ్చారు. అందరితో పాటు కాసింకు కూడా ఐదు సెంట్ల స్థలముకు సంబంధించిన పట్టా ఇచ్చారు. అప్పటి నుండి 30 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. అక్కడ నివాసితులను మిగతా వారిని ఎవరిని ఏమనకుండా దుబ్బ కాసిం టార్గెట్ చేస్తూ అతను స్థలంపై ఇప్పుడు కొందరు నేతలు కన్ను వేశారు. ఎలాగైనా ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.కాశీంకు ఇచ్చిన స్థలం అనుకోని పెద్ద వంక ఉంది వర్షాకాలంలో ఇతను వేసుకున్నటువంటి కొట్టం వరకు వరద నీళ్లు వస్తాయిని గతంలో చాలామంది ఆ వంకలో కొట్టుకుపోయి చనిపోయారని, వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడూ నీటితో నిండి ఉండే ఈ స్థలంలో చిన్న పిల్లలకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని నువ్వు ఈ స్థలం కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనని తనను ఈ స్థలం నుంచి వెంటనే వెళ్ళిపోవాలని అధికారులను అడ్డు పెట్టుకొని బలవంతంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో వీఆర్వో, తలారి వచ్చినోటీసులు ఇచ్చి తనతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్య వలన గతంలో కోర్ట్ కు వెళ్లానని కోర్టులో కూడా తనకు అనుకూలంగా స్టే ఇచ్చారు. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కోర్టు తనకు ఇచ్చిన ఆర్డర్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పినా వినకుండా, నాకు ఎవరి అండదండలు లేవనే ఉద్దేశం తో నాలాంటి పేదవాడిపై కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, నేను టిడిపి పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తను, గోకులం షెడ్డు నిర్మాణం కొరకు,ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అక్కడ గోకులం షెడ్డు నిర్మించుకోవడానికి, పర్మిషన్ ఇప్పించారని. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ తోనే ప్రస్తుతం అక్కడ షెడ్డు వేసుకున్నానని దాన్ని కూడా పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ఇంట్లో లేని సమయంలో, మాఇంటి దగ్గరకు వచ్చి ఆడవాళ్ళతో అసభ్యకరంగా నానా దుర్భాషలాడిలారని,తనను ఎవరు పట్టించికోక పొతే ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తే తాను తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవాడానికి వెనకడబొమని, తెలిపారు.ఇప్పటికైనా అధికారులు అన్ని ఆధారాలను పరిశీలించితనకు తగు న్యాయం చేయాలని పత్రిక ముఖంగా వేడుకున్నారు.