అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న గువ్వల రమేష్ రెడ్డి

పయనుంచే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 11.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి పాల్గొన్నారు బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న రాహుకాల అభిషేకంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు అనంతరం గోశాలను సందర్శించారు వేసవిలో గోవులకు నీరు మేత సమస్య లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు దిగువపల్లి పంచాయతీ ఆర్ఆర్ కాలనీ నందు నూతనంగా ఏర్పాటుచేసిన శుద్ధ జల యంత్రాన్ని ఆయన ప్రజలకు అంకితం చేశారు దశాబ్దాలు తరబడి నెలకొని ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించారని గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మేకల వారి పల్లి ఉన్నత పాఠశాలలో అదనపు భవనం కోసం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బోయకొండ సుబ్బు సుజేయన్ రాజు హమీద్ ఖాన్ కుమార్ రెడ్డి సోము రాధాకృష్ణ పాఠశాల ఉపాధ్యాయ బృందం నాయకులు పాల్గొన్నారు