పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /11:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట లోని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, తో కలిసి మీడియా సమావేశం.
ప్రజల పట్ల వివక్ష చూపితే కవ్వంపల్లికి తిరుగుబాటు తప్పదు. 11గ్రామాలకు నిధులు ఇవ్వకుండా కవ్వంపల్లి ఎందుకు వివక్ష చూపుతున్నారు. 11 గ్రామాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాదా కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పై ఎమ్మెల్యే కవ్వంపల్లి వివక్ష చూపుతున్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ లకు నిధులు ఇవ్వకుండాఎమ్మెల్యే వివక్షకు గురి చేస్తున్నారు. ఎంఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా నిధులు ఇవ్వడం లేదు. ఉపాధిహామీ నిధులు ఎవరి జాగీరు కాదు. ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్పంచ్ లను వివక్షకు గురి చేస్తున్నారు. ఉపాధిహామీ ద్వారా కేంద్రం నుంచి 60%శాతం నిధులు వస్తే రాష్ట్ర సర్కారు నుంచి 40% శాతం మాత్రమే నిధులు ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చి ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీలకు గాను 24 పంచాయతీలకు మాత్రమే నిధులు ఇచ్చారు. ఎమ్మెల్యే 24 గ్రామాలకు మాత్రమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బే సర్పంచ్ లను మోసం చేస్తోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏ ముఖం పెట్టుకుని నిధులివ్వని 11 గ్రామాలకు వస్తారు ఎమ్మెల్యే కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిగతా 11 గ్రామాలకు నిధులు మంజూరు చేయించాలి. పార్టీ మారాలని సర్పంచ్ లను ఎమ్మెల్యే బెదిరించడం ఏంటి.. ఉపాధిహామీ ద్వారా ప్రతి గ్రామానికి లేబర్, మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది ప్రతి గ్రామానికి నిధులు ఇవ్వాలి. నిధులు మంజూరు చేయని 11 గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కలెక్టర్ ను కలుస్తాం. ఎమ్మెల్యే కవ్వంపల్లి కి దమ్ముంటే తన సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. కానీ వివక్ష చూపొద్దు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రేండున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశాడో చూపించాలి. ఎమ్మెల్యే కవ్వంపల్లి అర్ధరాత్రి వేళల్లో పిచ్చిలేసినట్టు తిరుగుతున్నాడు. కవ్వంపల్లి సత్యనారాయణ నిధులు తేకుండా గ్రామాల్లో ఎలా అడుగుపెడతాడో ప్రజలు చూపిస్తారు. ఆరు గ్యారెంటీల వంటి హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. మరో ఏడాది కాలంలో కవ్వంపల్లి సత్యనారాయణ వెంట ఉన్న నాయకులు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉండరు. గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపకుండా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసినామ్ ఎమ్మెల్యే 11 గ్రామాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడితే కోర్టుకెళ్లి అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకుంటాం. రాబోయే ఎంపీటీసీ,జడ్పీటీసి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రుకాల్చి వాతపెడతాం. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు చిల్లర బెదిరింపులకు ఎవరూ బయపదడరు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వక్రబుద్ది మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతాం. ఎంఎన్ఆర్ఈజీఎస్ ప్రజలందరి హక్కు? ఇల్లంతకుంట మండలానికి సెపరేట్ ఎమ్మెల్యే లేడు కాబట్టి అన్నీ గ్రామాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కవ్వంపై ఉంది. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, సర్పంచ్ లు మరిజె మోహన్ రావు, వికృతి స్నేహా లక్ష్మరెడ్డి,కముటమ్ లావణ్య రాములు,రడం లక్ష్మీ ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్, సావనపల్లి వనజ అనీల్, ఎం.డి సాదుల్, బీఆర్ఎస్ నాయకులు ఆరే కొమురయ్య, తూటి పర్శరాం,శ్రీనివాస్ రెడ్డి, అల్వాల రాజేశం, పండుగ భాస్కర్, ర్యాగటి రమేష్, ఎడ్ల ప్రశాంత్ రెడ్డి,సత్యం, గడ్డం తిరుపతి, దయ్యాల మహేష్, సంతోష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, తిరుపతి రావు, కూనబోయిన రఘు, రాజారాం, తదితరులు పాల్గొన్నారు.