ఉట్నూరులో 16న ఐటీడీఏ పండ్ల తోటల వేలం

ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూరు: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీల్లో ఉన్న పండ్ల తోటలకు ఈనెల 16న మెగా వేలంపాట నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ తెలిపారు ఉట్నూరు పీఓ కార్యాలయంలో ఈ వేలం నిర్వహించనున్నారు గతానికి భిన్నంగా ఈసారి తోటలను మూడేళ్ల కాలపరిమితికి ఒకేసారి కేటాయించనుండటం విశేషం వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా సంబంధిత నర్సరీలను సందర్శించి తోటల పరిస్థితిని పరిశీలించాలని అధికారులు సూచించారు. వేలంపాటకు సంబంధించిన ఇతర వివరాల కోసం పీఓ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.