
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఈనెల 26వ తేదీన 'ఫూలే - అంబేద్కర్ మహనీయుల జాతర' పోస్టర్ ను జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.అంబేద్కర్ మహనీయుల జాతర’ పోస్టర్‌ను జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ మార్పు కోసం పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు హన్వాడ మండల కేంద్రంలో ప్రారంభం కానుంది. సమాజ సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ జాతర సాగనుందనీ కమిటీ అధ్యక్షులు టంకర శ్రీనివాస్ పేర్కొన్నారు..ఈ సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీం తో పాటు ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్ధన్ గారు విచ్చేయనున్నారని అన్నారు. ఈ జాతరకు మండలంలోని ప్రజలు, యువకులు, మేధావులు వివిధ ప్రజా సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు టంకర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎదిర నర్సింలు, రాజు ,యాదయ్య, చెన్నయ్య శంకర్ శ్రీనయ్య మిగతా కళాకారులు సంఘం సభ్యులు పాల్గొన్నారు.