పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో ఈ నెల 11న నుండి ప్రారంభం కానున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ బాగావత్ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం కందకుర్తి గ్రామంలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ జరుగుతున్న ఏర్పట్లను సమగ్రంగా సమీక్షించి భద్రత లాజిస్టిక్స్ మరియు విభాగాల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి సాధిస్తూ అన్ని ఏర్పట్లను సమయానికి సమర్థవంతంగా పూర్తయ్యాలా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బోధన్ ఎసిపి శ్రీనివాస్ రెంజల్ తహసిల్దార్ శ్రవణ్ ఆర్&బి డిఈతో పాటు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు