పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 బోధన్ :కరెంటు షాక్ తగిలి మరణించిన బోధన్ మండలం ఖండ్గావ్ గ్రామానికి చెందిన రైతు మీసాలే ముకుంద్ కుటుంబానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కల్దుర్కి ద్వారా జెపీఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద రూ. 2,00,000/- ఆర్థిక సహాయాన్ని వారి భార్య మీసాలే రమాబాయికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శ్రీనివాస్ చారి బ్యాంకు మేనేజర్ సంతోష్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సకాలంలో పంట రుణాలను రెన్యువల్ చేసిన రైతులకు రూ. 2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు కావున సంఘ పరిధిలోని రైతులు తమ పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేసుకోవలసిందిగా తెలియజేయడం జరిగింది.