కో ఆప్షన్ నామినేషన్ వేసిన కొమిరెడ్డి శేషగిరి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 11 మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో నాలుగు కో ఆప్షన్ పదవులకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడగా మెట్ పల్లి పట్టణంలోని 11వ వార్డుకు చెందిన యువనాయకుడు, న్యాయవాది కొమిరెడ్డి శేషగిరి ప్రత్యేక మేధావి కోటాలో మున్సిపల్ మేనేజర్ కి తన యొక్క నామినేషన్ పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కొమిరెడ్డి శేషగిరి మాట్లాడుతూ యువకుడిని , చదువుకున్న వాడిని చట్టాల పై అవగాహన ఉన్న వ్యక్తిగా మున్సిపల్ ప్రత్యేక మేధావి కోటా కింద నేడు నామినేషన్ వేయడం జరిగింది అని తెలిపారు మరియు పార్టీల కు అతీతంగా అన్ని పార్టీల కౌన్సిలర్లను మద్దతు కోసం అభ్యర్థిస్తున్నానని , యువకుడిగా చదువుకున్న వ్యక్తిగా మరియు అందరినీ కలుపుకుపోయి మున్సిపల్ అభివృద్ధి కోసం పని చేస్తానని పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తనకు అవకాశం కల్పించాలని కౌన్సిలర్లను కోరుతున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఆకుల ప్రవీణ్, రైతు నాయకుడు సుతారి భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.