చిన్నారులకు సమతుల్య ఆహారం అందించాలి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 11 మామిడిపెల్లి లక్ష్మణ్ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు రోగ నిరోధక శక్తికి,మానసిక వికాసానికి సమతుల్యమైన ఆహారం అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ అనుహ్య అన్నారు.శుక్రవారం రాయికల్ మండలం ఇటిక్యాల సెక్టార్ లోని ఇటిక్యాల గ్రామంలో గల మూడవ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల పెరుగుదలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల పెరుగుదల వివరాలు తీసుకొని సమతుల్య ఆహారం, ఆహార లోపం దాని ప్రభావాల గురించి వివరించారు.కాగా చిన్నారులకు సమతుల ఆహారం ఇవ్వడం వల్ల మానసిక శారీరక ఎదుగుదలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని,చిన్నతనంలోనే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్,వార్డు సభ్యురాలు మలానీ, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.