జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కి వినతి పత్రం అందజేసిన కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 11/26 సత్తుపల్లి రూలర్ : రిపోర్టర్ : గద్దె.విజయబాబు కల్లూరు కొత్త మున్సిపాలిటీ లో ఉన్న ప్రధాన సమస్యలైనా డంపింగ్ యార్డ్ మరియు సిబ్బంది వేతనాలు గురించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి ని కలిసి వినతి పత్రం అందించిన కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామని తెలియజేశారు అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దడంలో కలెక్టర్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కలెక్టర్ పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి, కౌన్సిలర్స్ ఉబ్బన రాంబాబు, యాస నాగమణి శ్రీకాంత్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ధరావత్ రవికుమార్ పాల్గొన్నారు.