పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 11 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతారామ జిల్లా అరకు లోయ మండల కేంద్రం పరిధిలో దానిరంగిని గ్రామంలో మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని పాడేరు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన మహిళలు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు నాయకులు. అరకు వేలి మండలం మాడగడ పంచాయతీ దాని రంగిని గ్రామంలో జలజీవన్ మిషిన్ ద్వారా వేసిన బోరు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉండడం వలన మా గ్రామంలో మంచినీరు సమస్య తీవ్రంగా ఏర్పడుతుందని మహిళలు పాడేరు ప్రజావాణికి చేరుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. మండల స్థాయి అధికారులు ద్వారా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా సంబంధికారులకు కలిసి సమస్య పరిష్కారం చేయాలని విన్నవించారు. తమ పనులు మానేసి పాడేరు చేరుకోవడం జరిగింది. దాని రంగిని మహిళలు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మాకు ఉన్నా మంచినీరు సమస్య సత్వరమే పరిష్కారం చేయకపోతే నిరసన కార్యక్రమానికి బిందెలు తో సిద్ధమవుతామని అన్నారు. వేసవికాలం కావడంతో నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొంటున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దఫాలుగా మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని వినతులు ఇస్తున్న నామమత్రంగా సమస్య పరిష్కారానికి సహకరిస్తున్నట్టు అధికారులు పని ఉంది కానీ శాశ్వతంగా మంచినీళ్లు సమస్య పరిష్కారం చేయాలని చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పంచాయతీ నాయకులు ఎస్. సత్యారావు టీ. దామోదర్, బాబురావు, రంభమని, ధనముత్తి, జమున, నొయిన, రాములమ్మ, సుమంతి, మాలతి, హరి, ప్రమీల , లక్ష్మి,కమల తదితరులు పాల్గొన్నారు.