పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మ కమిటీ డైరెక్టర్ & మాజీ జడ్పీటీసీ కూరపాటి తిరీష, గ్రామ సర్పంచ్ ఏపూరి పద్మావతి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్నకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంటను నేరుగా కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చింతకాని మాజీ చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, నాగిలిగొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి గడ్డం శ్రీను, కొనకంచి మధుసూదన్, పంది వీరభద్రం, మురళి, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.