నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

★ కమ్మ గూడెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం . ★అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ గోలిలూర్ధమ్మ కుటుంబ సభ్యుల పరామర్శ . ★తెరటి పల్లి గ్రామంలో ఆకుల పద్మ ఇందిరమ్మ గృహప్రవేశం లో పాల్గొన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .

 పయనించే సూర్యుడు న్యూస్ గట్టుప్పల్ ఏప్రిల్ 11. గట్టుప్పల్ మండలం కమ్మ గూడెం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ వ్యవస్థ ద్వారానే గ్రామంలో అభివృద్ధి పనులు సజావుగా జరుగుతాయని, గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.  గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి తన వంతుగా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. ఆనంతరం గట్టుప్పల్ మండలం కమ్మ గూడెంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ గోలిలూర్ధమ్మ నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుమారుడు ప్రసాద్ తో పాటు వారి కుటుంబ సభ్యులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు . గట్టుప్పల్ మండలం తెరటి పల్లి గ్రామంలో నిరుపేద మహిళ ఆకుల పద్మ నూతన నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో ఆయన స్వయంగా వెళ్లి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీకార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, గట్టుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నామని జగన్నాధం, విరమళ్ళ శ్రీశైలం, తహసీల్దార్ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు ,కార్యకర్తలు, పాల్గొన్నారు.