పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఏప్రిల్ 11. మునుగోడు పట్టణంలోని లక్ష్మీదేవి గూడెం లో నెలకొన్న నీటి సమస్యను మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పరిష్కరించారు. నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మీదేవి గూడెం కాలనీవాసులు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతుండగా… నీటి ఎద్దడిని నివారించడానికి వేసిన బోరుబావిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు . అనంతరం లక్ష్మీదేవి గూడెం లో ఉన్న ఆంజనేయస్వామి గుడిని సందర్శించారు. ఈ కార్యక్రంమలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.