పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.11.2026 ఎట్టపాక మండలం పరిధిలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా నాన్ ట్రైబల్స్ కి పట్టాలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని."ఆదివాసి సంక్షేమ పరిషత్"(274/16)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆరోపించారు.పూర్వం నుంచి ఆదివాసులు సాగు చేసుకుంటున్నాటువంటి పట్టా లేని భూములను అదునుగా చేసుకుంటూ రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి రాష్ట్ర విభజన తర్వాత ముంపు మండలాలు స్థిరపడే సమయంలో సందిట్లో సడిమేయ్యలాగ ప్రభుత్వ భూములను నాన్ ట్రైబల్స్ కి రాష్ట్ర విభజన తర్వా కొత్తగా వచ్చిన రెవెన్యూ అధికారులు దోచి పెట్టారని.ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు..అటువంటి అక్రమ పట్టాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని.అటువంటి తప్పుడు పట్టాలను అడ్డం పెట్టుకొని పూర్వ నుండి సాగులు చేసుకుంటున్నటువంటి.ఆదివాసి భూములు పై తమకు పట్టాలు ఉన్నాయని.రాజకీయ పలుకుబడి తోటి డబ్బు బలం తోటి అధికారులను మేనేజ్ చేస్తూ అసలైన సాగుదారులైన ఆదివాసులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు బనాయిస్తూ భూములు కబ్జా చేస్తున్నారని.వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2014 సంవత్సరం తర్వాత ఎటపాక ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ మరియు ఆదివాసి సాగు భూములను వేలాది ఎకరాలను అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు తెలిసిందని.రాష్ట్ర విభజన తర్వాత ఎట్టపాక మండలంలో నాన్ ట్రైబల్స్ ఎంతమంది పట్టాలు పొంది ఉన్నారు.అటువంటి వాటిని గుర్తించి రద్దు చేయాలని,మరియు ఏజెన్సీ చట్టాలు విరుద్ధంగా పట్టాలు పొందిన వారిపై మరియు పట్టాలు జారీ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.1970 తర్వాత ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్ కి పట్టాలు జారీ చేయడం పూర్తిగా నిషేధించబడిందని.అలాంటిది చట్టం అమల్లో ఉన్న ఎటపాక మండలంలో ఈ పది సంవత్సరాల కాలంలోనే వేలాది ఎకరాలను నాన్ ట్రైబల్స్ కి రెవెన్యూ అధికారులు దోచి పెట్టారని.దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కుంజా శ్రీను"ఆదివాసి సంక్షేమ పరిషత్"(274/16)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.