బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు , 11 ఏప్రిల్ 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పట్టణానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు మంజూరు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయం అని ఆమె పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 20 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయగా, ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ సంటి లత నర్సయ్య, కౌన్సిలర్లు తోట సతీష్, సందీప్, ఆరెపల్లి నాగేంద్రబాబు, అనంతరావు, ప్రజా ప్రతినిధులు బాలగంగాధర్, గంగయ్య, మీసాల నవీన్, కిరణ్, దినేష్, శ్రీకాంత్ తదితరులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ]