మెడికల్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు

కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 క్యాతంపల్లి. ఈరోజు కాసిపేట 1 గనిలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు ఎస్.వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి.రాజేందర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలంగా గుర్తింపు సంఘం నాయకుల అలసత్వం వల్లనే యాజమాన్యం కార్మికులకు నాణ్యమైన సమయానికి ఇవ్వాల్సిన నాణ్యత గల బిట్లు, సబ్బల్లు,బోల్టర్ మిషన్ బిట్లు, జాములు సరిగ్గా ఇవ్వడం లేదని లైన్మెన్ లకు గిరిమెట్లు, కీలలు వంటివి సప్లై చేయడం లేదని చివరకు రెస్ట్ రూమ్ల క్లీనింగ్, సేఫ్టీ లాకర్ల వంటివి గని సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. అనంతరం రాజేంద్రప్రసాద్, రాజ్ కుమార్ లకు ముఖ్య అతిథిగా వచ్చిన జనరల్ సెక్రటరీ తుమ్మల.రాజారెడ్డి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాలు వేరైనా కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ఒకటేనని, అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడులను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనని చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నారని, మెడికల్ బోర్డుపై కార్మిక సంఘాలను బదనాం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకి రావాల్సిన బకాయిలపై మాత్రం నోరు మెదపడం లేదని పైపెచ్చు సింగరేణి సంస్థను ఏటీఎం కార్డు లాగా వాడుకుంటున్నారని, బకాయిలు ఇప్పించడం కొరకు సిఐటియుగా హైదరాబాద్ లో త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నామని అన్నారు. గుర్తింపు సంఘం నాయకులు గత సంవత్సరం లాభాల ప్రకటన సమయంలో మిన్నకుండి ఇప్పుడు గగ్గోలు పెడుతూ లేబర్ కమిషనర్ నిర్వహించిన రెండు సంవత్సరాల కాలపరిమితి ముగియగానే పరిష్కరించలేని సమస్యలపై ఇప్పుడు పోరాటం ఒంటరిగా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అన్ని సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేయడానికి పెద్దన్న పాత్ర పోషించేలా ముందుకు వచ్చి పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. మరోవైపు ఐ ఎన్ టి సి నాయకులు శాలువాలు కప్పుతో బొకేలు ఇచ్చిన ఇప్పటికి మెడికల్ బోర్డును కట్టించలేకపోయారని ఇప్పుడు యూనియన్ నే బధనం చేస్తుంటే ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇప్పటికే వేజ్ బోర్డు కమిటీ వేయాల్సి ఉండగా లేబర్ కోడ్ లను అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో కోలిండియా యాజమాన్యం స్పందించడం లేదని అందుకే ఈ లేబర్ కోడులను వెనక్కు తీసుకునేలా ఎనర్జీ సెక్టార్ లోని అన్ని యూనియన్లతో జాతీయస్థాయిలో సిఐటియుగా చర్చలు జరుపుతున్నామని త్వరలో కార్మికులందరూ నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. అనంతరం గనిలోని స్తానిక సమస్యలపై మేనేజర్ సతీష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ నాగవెల్లి శ్రీధర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు జడల ప్రవీణ్, దెబ్బటి.శ్రీనివాస్, కాసిపేట గనుల ఇన్చార్జి గోపాలకృష్ణ, బుద్దె.సురేష్, ధనిశెట్టి.సురేష్, జుట్టు.అజయ్,గజ్జల సత్యనారాయణ కొండు.తిరుపతి, రాజశేఖర్, ఆర్గనైజర్ చైతన్యరెడ్డి మరియు కార్మికులు పాల్గొన్నారు.