పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 11 పోలవరం జిల్లా ఎటపాక మండల కేంద్రంలో ఐక్య ఉపాద్యాయ సంఘం (యుటిఎఫ్) జీవో నెంబర్ 3 రద్దుకు త్రికరణ శుద్దితో పనిచేసిందని, జివో అమలు కోసం కాదని ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ (ఎటిఎ) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కనితి రామకృష్ణ పేర్కొన్నారు. పోలవరం జిల్లా ఎటపాక లోని ఎటిఎ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 1986 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏజెన్సిలో స్థానిక అదివాసులతో ఉపాద్యాయ నియామకాలకు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ నియమాలను అనుసరించి జివో నంబర్ 275 తిసుకోచ్చిందన్నారు. జివో నంబర్ 275 పై ఆదివాసేతరులు వేసిన కేసులో న్యాయపరమైన సవాలు అధిగమించి, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10.01.2000 న జివో నంబర్ 3 ని తిసుకోచ్చారన్నారు. అయితే ఈ జీవోను కూడా గిరిజనేతరులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి 19.09.2000 న సి.ఏ నెం.2138/2000 ద్వారా రద్దు చేయించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ల నాయకత్వంలో సోందె వీరయ్య గారు జీవో నెంబర్ 3 ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంటును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డబ్ల్యు.పి.నెం. 20239/2000 ద్వారా 25.10.2000 న సస్పెండ్ చేయించడం జరిగింది. ఆ తరువాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పెషల్ డిఎస్సీలు నిర్వహించి ఏజెన్సీలో పూర్తి స్థాయి ఉపాద్యాయ నియామకాలు చేపట్టిందన్నారు. ఈ పోరాటంలో యుటిఎఫ్ పాత్ర ఎక్కడుందని ప్రశ్నించారు. యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కేంద్రంగా గిరిజనేతర ఉపాధ్యాయ సంఘాలన్నీటిని ఏకం చేసి, జనరల్ టీచర్స్ ఫోరం (జి.టి.ఎప్)ను ఏర్పాటు చేసి కోర్టు ఖర్చుల కోసం నిధుల సమీకరించిన మాట వాస్తవం కాదా, ఒకవేళ వాస్తవం కాకపోతే జీప్టీఎఫ్ అనే సంఘం ఎందుకు స్థాపించబడింది ఆ సంఘం ద్వారా ఎక్కడ ఉద్యమాలు చేశారు ఎటువంటి ఉద్యమాలు చేశారు ఈ సంఘం కేవలం జీవో నెంబర్ 3 ని సుప్రీంకోర్టులో రద్దు చేయించడానికి మాత్రం ఉపయోగపడిందని కరాకండిగ చెప్పగలం జివో నంబర్ 3 రద్దుకు తమ ప్రమేయం లేకపోతే యుటిఎఫ్ పెద్దన్న పాత్ర పోషించి జిటిఎఫ్ ను ఎందుకు ఏర్పాటు చేసినట్టు? జీవో నెంబర్ 3 రద్దుకు నిధులు సమీకరించడానికి కాదా? మీ వల్ల ఆదివాసి జాతికి జరిగిన నష్టం గురించి ఎవరికీ తెలియదనుకున్నారా? తెలిసిన ఎం చేయగలరనుకున్నారా? ఆదివాసి సమాజానికి మీరు చేసిన ద్రోహపురిత చర్యలు ఒక్కొక్కటిగా బహిర్గతం చేయడానికి ఎటిఎ, ఆదివాసి సంక్షేమ పరిషత్, సంసిద్దంగా ఉందని స్పష్టం చేసారు. యుటిఎఫ్, జీవో నెంబర్ 3 రద్దుకు త్రికరణ శుద్ధితో పనిచేశాయని, జివో అమలుకు కాదని, మీరు ఆదివాసి సమాజానికి చేసిన ద్రోహాం తెలియని కిందిస్థాయి ఆదివాసి సభ్యులతో పచ్చి అబద్ధాలు మాట్లాదిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీలు, అన్ ట్రైన్ద్ టీచర్స్ నియామకాలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ, ప్రత్యేక డీఎస్సీలకు మూలమైన జివో 3 రద్దుకు సర్వవిధాల కృషి చేసిన యుటిఎఫ్ ఆదివాసీల సంక్షేమం గురించి సదస్సులు పెట్టడమంత సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. మీరు నిర్వహించ బోయే సదస్సుకు వక్తలు కానివ్వండి, అతిథులు కానివ్వండి ఎవరైనా ఆదివాసీలు ఉన్నారా ఒక్క మిడియం బాబురావు తప్ప అంటే ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు మా అస్తిత్వం, మా భావజాలం తెలియని మీరు మాట్లాడుతుంటే స్టేజి ముందు కూర్చున్న మా ఆదివాసీ ఉపాధ్యాయులు చప్పట్లు కొట్టాలన్నమాట ఏమిటి ఈ దౌర్భాగ్యం ఆదివాసిలపై యుటిఎఫ్ కు చిత్తశుద్ది లేదని, ఇంకెంత కాలం మీ అబద్ధపు మాటలతో మా ఆదివాసి ఉపాధ్యాయులను మీ కబంధహస్తాల్లో కట్టి పెడతారని ప్రశ్నించారు. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న ఆదివాసి ఉపాద్యాయులు ఆ సంఘానికి ఇచ్చిన ప్రతి పైసా, ఆదివాసులకు వ్యతిరేకంగా ఖర్చుపెట్టారని, ఆ సంఘం నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు. 1989లో గిరిజనేతర, గిరిజన ఆన్ ట్రైన్డ్ ఉపాధ్యాయులను నియమించినారని, అందరు ఉపాధ్యాయులకు కామన్ గానే నోషనల్ ఇంక్రిమెంట్ వస్తే, ఆదివాసి ఉపాద్యయులకు మాత్రమే చేసినట్లుగా గొప్పలు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఆన్ ట్రైన్డ్ ఉపాధ్యాయులకు శిక్షణ కొరకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు కృషిచేసాయాని, అదేదో యుటిఎఫ్ మాత్రమే పనిగట్టుకుని పని చేయలేదని అన్నారు. తన అసలు రూపం బయటపడుతున్న కొద్ది యుటిఎఫ్ ప్రాబల్యం తగ్గుతుందని, ఆదివాసి ఉపాద్యాయుల సమస్యలు పక్కనపెట్టి “సంస్కృతి, సాంప్రదాయాలు, చట్టాల అంటూ సదస్సులతో టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారని, ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై గౌరవం లేని ఆ సంఘానికి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు - చట్టాల పై మాట్లాడే అర్హత మీకేక్కదిదని ఘాటైన వ్యాక్యాలు చేసారు. ఏజెన్సి ప్రాంతంలో ఆదివాసి ఉపాధ్యాయులకు వంద శాతం ప్రమోషన్స్ కల్పిస్తు 2009లో గిరిజన సంక్షేమ శాఖ 9200/2009 మేమో జారి చేసిందని, ఈ ఉత్తర్వులు అమలుకు యుటిఎఫ్ ఎందుకు ఒక్కమాటైన మాట్లాడలేదని, మీకు అవగాహన లేకనా? లేదా ఆదివాసి ఉపాధ్యాయుల ఎదుగుదల ఓర్వలేకనా? చెప్పాలన్నారు. ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ (అట ) చొరవతో అన్ని ఆదివాసేతర ఉపాద్యాయ సంఘాలను ఎదిరించి, ప్రభుత్వాన్ని ఒప్పించి 2012 నుండి ప్రమోషన్లు పొందగలిగమన్నారు. ఆదివాసి ఉపాధ్యాయులు ప్రమోషన్స్ లో నష్టపోతున్నా, అన్ని జీవోలు తెలిసిన యుటిఎఫ్ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఎందుకు స్పందించలేదన్నారు. ఎవరు అడుగుతారులే అన్న నిర్లక్ష్యమా? లేదా ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నారా? అని ద్వజమెత్తారు. జివో నంబర్ 3 రద్దుకు వ్యతిరేకంగా ఆదివాసి విద్యార్ధి, ఉద్యోగ, ఉపాద్యాయ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో పాటు, “షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం” కోసం నిరంతర పోరాటాలు చేస్తుంటే మీ గొంతులు ఎందుకు మూగబోయాయని ప్రశ్నించారు. ఆదివాసీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఉద్యమాలు చేస్తున్న, యుటిఎఫ్ ఆదిఅవాసేతర రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించడం గాని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ గాని ఎందుకు వేయలేదని ప్రశ్నించినారు. ఈ సమావేశంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాక రాజు, అపక నాగేశ్వరరావు, మానే ప్రవీణ్, కోశాధికారి కురసం రాకేష్, పోడియం రాజశేఖర్, మడకం రాంబాబు పాల్గొన్నారు.