పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘాల అధ్యక్షురాలు శ్రీమతి మౌనిక రేంజర్ల లక్ష్మి సి ఎ బోయిని స్వామి, ఏపీఎం దుర్గాప్రసాద్ సిసి అంజయ్య ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ గ్రామ రైతులు ఐకెపి ద్వారా మన గ్రామంలో పెట్టిన ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాంచనపల్లి నవీన్,ఉపసర్పంచ్ కొలుపుల రామస్వామి, పంచాయతీ కార్యదర్శి బాలు, వార్డు సభ్యులు శ్రీరామ్,మహేష్, రమేష్, మాజీ వార్డు నెంబరు నీల రాములు, గ్రామ పెద్దలు రైతులు కట్ట అంజయ్య గౌడ్, గాండ్ల సత్యం, మాచి నపల్లి రమేష్,మేకల బాలరాజు, కృష్ణారెడ్డి, చంద్రం, కట్ట శేఖర్, గౌడ్ , గజ్జల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.