పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 11 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ శనివారం నుండి మొదలు పెట్టబోయే ఆమరణ నిరాహార దీక్ష విజవంతం కావాలని ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీవై ఇంచార్జ్ గొంప శివ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం లింగంపర్తి గ్రామంలో వెలసిన దుర్గాదేవి ఆలయంలో బీసీవై పార్టీ ఇంచార్జ్ గొంప శివ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా శివ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీ కులాలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తు అధ్యక్షులు రామచoద్రా యాదవ్ చేయబోయే నిరాహార దీక్ష విజవంతంగా జరగాలని పూజలు నిర్వహించమన్నారు.కూటమి ప్రభుత్వానికి ఎన్నో మార్లు మొరపెట్టుకున్న బీసీ నిధులు విషయంలో నిమ్మకూనిరేత్తనట్టు వ్యవహారిస్తున్నదని అందుకే ఈ నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో అధిక సంఖ్యలో బీసీ జనాభా ఉన్నా కానీ ఏ ప్రభుత్వం వచ్చిన బీసీ లకు అన్యాయమే జరుగుతుంది అన్నారు.ఓట్లు వేసే సమయంలో ఏదేదో మాయ మాటలు చెప్పి నమ్మప్రలికి ఓట్లు వేయించుకుంటున్నారు,కానీ నిధులు కేటాయించే సమయంలో మాత్రం బీసీ లను పట్టించుకోవడం లేదు అన్నారు. బీసీలకు ఒక అండగా నిలబడి బీసీ జనాభాకు న్యాయం చేయడానికి వచ్చిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అన్నారు.అంతేకాదు బీసీలు ఏ ఏ పార్టీ లో ఉన్న ఆ పార్టీ పని వాడిలా వాడుకుంటుందే తప్ప కనీసం నామినేటడ్ పదవులు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నాం అని ఇప్పటికైనా వీళ్ళ కుటుంబ పాలనలోతో ఎంత మోసం చేస్తున్నారో బీసీ నాయకులు అర్ధం చేసుకుని రామచంద్ర యాదవ్ ప్రత్యేక్షంగా పరోక్షంగా మద్దత్తు ఇచ్చి మన బీసీ మనుగడను కాపాడుకోవాలని అయన అన్నారు.తన ప్రాణాన్ని పణంగా పెట్టి బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్న రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకు హాజరై విజవంతం చేయాలనీ కోరుతున్నా అన్నారు.ఈ కార్యక్రమంలో పితాని వీర్రాజు,పితాని శ్రీనివాస్,దాడి శ్రీనివాసు,గోళ్ళ శ్రీనివాస్, శ్రీనివాస్,నైదాని రఘు,కుండల శ్రీను, సానబోయిన ఆదిబాబు,కర్రి బాబి,దాడి రమణ,శ్రీను,రాయుడు తదితరులు పాల్గొన్నారు.