పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 సాలూర : సాలూర మండల కేంద్రంలో వడ్లు మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించాలని సాలుర బిజెపి మండల అధ్యక్షులు రావుబా గంగాధర్ శుక్రవారం మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ వడగాళ్ల వర్షాలతో మందర్న హున్సా ఖాజాపూర్ గ్రామాలలో పంట నష్టపోయి రైతులు బాధపడతా ఉంటే ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధి లేనట్టు పనిచేస్తుంది రైతులు కన్నీరు కూడా ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కనబడత లేదా ఇప్పటివరకు ఏ మీడియా సమావేశంలో కూడా ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కసారి కూడా మా రైతుల గురించి మాట్లాడకపోవడం బాధాకర విశేషం అని వారం రోజులు అవుతున్నా కూడా రైతులు కన్నీటితో పంట పొలాల్లో ఏడుస్తూ ఉంటే కనీసం వాళ్లని ఓదార్చి టైం లేదా ఇప్పటికైనా ప్రభుత్వం వడగళ్ల వానలో నష్టపోయిన రైతులను గుర్తించి తక్షణమే రైతులకు సాయం చేయాలని మండల బిజెపి అధ్యక్షులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజు నరేష్ లక్ష్మణ్ సంజు కాళిదాస్ గంగాధర్ సాయిలు రైతులు తదితరులు పాల్గొన్నారు