వత్సవాయి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 11 వత్సవాయి గ్రామానికి చెందిన ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రెడ్డి ఫండ్) ద్వారా మంజూరైన రూ. 2,12,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందజేశారు. వత్సవాయి గ్రామంలోని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, పెద్ది రామారావు, చిట్టూరి రమేష్, సాగర్ల కృష్ణవేణి, కనతాల రామకృష్ణ, చెన్న బాలకృష్ణ పెంట్ల గూడెం నరేష్ ఉప్పుగండ్ల వెంకటేశ్వరరావు, నర్మనేని శ్రీను, నెల్లూరి చిన్న శ్రీను, కనతాల నారాయణ, వడ్లమూడి అజేష్ తదితరులు పాల్గొన్నారు.