విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 11 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : యుటిఎఫ్ టీచర్స్ హోమ్ లో ఏపీ యుటిఎఫ్ ఏలేశ్వరం మండల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ సెంటర్ నందు శుక్రవారం యూటీఎఫ్ నాయకులచే స్టడీ మెటీరియలను ఆవిష్కరించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ స్టడీ మెటీరియల్ నిష్ణాతులైన అధ్యాపకులచే యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయబడిందని ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కార్యదర్శి జట్ల సోమరాజు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బి.అబ్బాయి,రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఎమ్.రాంబాబు,బి.వి.మోహన్ రావు,యుటిఎఫ్ నాయకులు గణపతిరావు ,ప్రభాకర్ రావు,శిష్టా మూర్తి,విశ్వనాధ్,రాజశేఖర్,రవి,రాంబాబు పాల్గొన్నారు.