వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి

ప్రజా బాటలో విద్యుత్ అధికారులను ఆదేశించిన విద్యుత్ శాఖ జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం

పయనించే సూర్యుడు , కోరుట్ల: ఏప్రిల్ 11: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం ఆదేశించారు. విద్యుత్ శాఖ జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో విద్యుత్ ప్రజాబాట నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ నియంత్రికలకు అమర్చిన స్మార్ట్ మీటర్ల తనిఖీ చేసి పని తీరు పర్యవేక్షించారు. ఈ స్మార్ట్ మీటర్లు నిరంతర విద్యుత్ సరఫరా కు దోహద పడతాయాని తెలిపారు. కోరుట్ల పట్టణంలో 160 కేవీఏ, ఆపై సామర్థ్యం గల నియంత్రి కలకు ముందుగా అమర్చుతు న్నట్లుగా తెలిపారు. త్వరలో పనిని పూర్తి చేయించి విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. విద్యుత్ సిబ్బంది కి విద్యుత్ లైన్లో పనిచేసేప్పుడు తగిన జాగ్రత్తలు, అవసరమైన రక్షణ పరికలను తీసుకొని విద్యుత్ ఆక్సిడెంట్లను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఇ మధుసూదన్, జగిత్యాల డిఇ టెక్నికల్ గంగారాం, కోరుట్ల ఏడిఇ భూమేశ్వర్, కోరుట్ల ఏ ఇ శ్యామ్, ఏ ఇ టెక్నికల్ జగిత్యాల, కోరుట్ల విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.