14 ఏప్రిల్ సమావేశాన్ని విజయవంతం చేద్దాం:లట్టుపల్లిలో బీఎస్పీ మీటింగ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజీనపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో 14 ఏప్రిల్ జరగనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ జోన్ ఇంచార్జ్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మాజీ జిల్లా ఇంచార్జ్ సి. కళ్యాణ్, అసెంబ్లీ కమిటీ ప్రధాన కార్యదర్శి బోనాసి భాస్కర్ తమ ప్రసంగాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, లట్టుపల్లి గ్రామ బీఎస్పీ నాయకులు గడ్డం వెంకట్, గట్టుకాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు 14 ఏప్రిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.