కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మేలుచేసేలా చర్యలు తీసుకోవాలి:ఎస్ ఎల్ పికాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 12 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శనివారం జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భాపుఘాట్ నందు కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్షా కార్యక్రమం నిర్వహించబడింది. అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకుంటున్న ట్రేడ్ డీల్ తో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిపిసిసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక, జిడిపిలో రైతు పాత్ర ఎంతో ఉందని అలాంటి రైతు వెన్నె ముక నే విరిచే ప్రయత్నం మానుకొని రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పంట బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజ కవర్గం కోఆ ర్డినేటర్ రఘునందన్ రెడ్డి,పలువురు కాంటెస్టెడ్ కార్పొరేట ర్లు,సీనియర్ నాయకులు,పార్టీ యువజన విభాగ నాయకులు పాల్గొన్నారు.